Thu Dec 18 2025 23:02:17 GMT+0000 (Coordinated Universal Time)
ఈటల రాజేందర్ తో సినీనటి దివ్యవాణి భేటీ
హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. ఇటీవలే ఏపీ టీడీపీకి గుడ్ బై చెప్పిన దివ్యవాణి..

ఈటల రాజేందర్ తో సినీనటి దివ్యవాణి భేటీ అయ్యారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. ఇటీవలే ఏపీ టీడీపీకి గుడ్ బై చెప్పిన దివ్యవాణి.. ఈటలతో సమావేశం అవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తన సత్తా చాటాలని భావిస్తోన్న బీజేపీ.. ఆ దిశగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడమే కాకుండా... సినీ గ్లామర్ ను కూడా వాడుకోవాలనుకుంటోంది. ఇప్పటికే విజయశాంతి, జయప్రద, జీవిత తదితర యాక్టర్లు బీజేపీలో ఉన్నారు. జయసుధ కూడా బీజేపీలో చేరబోతోందనే ప్రచారం జరుగుతోంది.
ఇటు ఏపీలోనూ తన బలాన్ని పెంచుకోవాలనకుంటోంది బీజేపీ. తాజాగా ఈటలతో దివ్యవాణి భేటీ అవగా.. దివ్యవాణిని బీజేపీలోకి ఆహ్వానించారని సమాచారం. అదే జరిగితే ఏపీ బీజేపీలో దివ్యవాణి కీలక నేతగా వ్యవహరించే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దివ్యవాణి కూడా బీజేపీలో చేరేందుకు సుముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది.
Next Story

