Thu Mar 19 2026 11:54:40 GMT+0530 (India Standard Time)
కవితతో శరత్ కుమార్ భేటీ
నటుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కల్వకుంట్లతో సమావేశమయ్యారు

నటుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. తమిళనాడులో ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి పార్టీని పెట్టిన శరత్ కుమార్ రాజకీయాల్లో పెద్దగా చురుగ్గా లేరు. అయితే ఆయన కల్వకుంట్ల కవితను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
బీఆర్ఎస్ పార్టీ...
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో ఆయన ప్రత్యేకంగా కవితతో సమావేశమయినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఆవిర్భావం, దాని ఉద్దేశ్యాలు, లక్ష్యాలను గురించి శరత్ కుమార్ కవితను అడిగి తెలుసుకున్నారు. అయితే మర్యాదపూర్వకంగా జరిగిన భేటీయేనని శరత్ కుమార్ తెలిపారు. రాజకీయ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
Next Story

