Fri Mar 20 2026 05:18:57 GMT+0530 (India Standard Time)
రేవంత్ పాదయాత్రలో యాక్సిడెంట్
రేవంత్ రెడ్డి పాదయాత్రలో యాక్సిడెంట్ జరిగింది. వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. మొత్తం ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయి

రేవంత్ రెడ్డి పాదయాత్రలో యాక్సిడెంట్ జరిగింది. వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. మొత్తం ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో పాదయాత్రలో కొద్దిసేపు కలకలం రేగింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న సంగతి తెలిసిందే.
ప్రమాదానికి ఓవర్ స్పీడ్..
అయితే ప్రమాదానికి కారణంపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా గుర్తించారు. వెంటనే పాదయాత్రలో ఉన్న నేతలు సర్దిచెప్పి పంపేశారు. ఓవర్ స్పీడ్ తో పరస్పరం కార్లు ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స పొందతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
Next Story

