Fri Dec 05 2025 10:30:49 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : పన్నెండు చోట్ల ఏసీబీ సోదాలు
హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. చొప్పదండిలోని ఎస్సారెస్పీ ఆఫీసులో ప్రస్తుతం నూనె శ్రీధర్ పనిచేస్తున్నారు. తెలంగాణలో నూనె శ్రీధర్ కు సంబంధించి మొత్తం పన్నెండు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో నూనె శ్రీధర్ పనిచేశారు. హైదరాబాద్, కరీంనగర్, చొప్పదండిలలో కూడా సోదాలు జరుగుతున్నాయి.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంట్లో...
అయితే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు నూనె శ్రీధర్ ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నూనె శ్రీధర్ ను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అంత ఆస్తులు ఎలా సంపాదించారన్న దానిపై విచారణ చేపట్టారు.
Next Story

