Wed Jul 16 2025 23:44:46 GMT+0000 (Coordinated Universal Time)
ఫార్ములా ఈ-రేస్ కేసులో నేడు
ఫార్ములా ఈ-రేస్ కేసులో నేడు ఏసీబీ అధికారులు ఎఫ్ఈఓ ను విచారించనున్నారు.

ఫార్ములా ఈ-రేస్ కేసులో నేడు ఏసీబీ అధికారులు ఎఫ్ఈఓ ను విచారించనున్నారు. ఈరోజు విచారణకు హాజరుకావాలని సీఈఓ, ఎఫ్ఈఓలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. లండన్ నుంచి వర్చువల్గా ఫార్ములా ఈ-రేస్ సీఈఓ హాజరుకానున్నారు.విచారణకు నెల రోజుల ఎఫ్ఈఓ సమయం కోరింది. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణ వేగవంతం చేశారు.
ఇప్పటికే విచారించి...
ఇటీవల ఈకేసులో భాగస్వామ్యులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ వైఎస్ ఛైర్మన్ బీఎస్ఎన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ లను ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో పాటు పలువురిని విచారించిన ఏసీబీ అధికారులు దీనిపై లోతుగా దర్యాప్తు చేయడానికి సిద్ధమయ్యారు. కార్ రేసింగ్ లో యాభై కోట్ల రూపాయలు దారిమళ్లాయని ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Next Story