Thu Mar 19 2026 06:26:43 GMT+0530 (India Standard Time)
మరోసారి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు
ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు

ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీ ఉదయంపది గంటలకు విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈరోజు ఉదయం విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన తన న్యాయవాదులను అనుమతించలేదని తిరిగి వెళ్లిపోయారు.
ఈ నెల 9వ తేదీన...
దీంతో మరోసారి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగానే హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు వచ్చి కేసులో దర్యాప్తునకు సహకరించాలని కోరారు. అయితే మళ్లీ న్యాయవాదుల విషయం ప్రస్తావనకు రాకపోవడంతో ఈ నెల 9వ తేదీన కూడా ఈరోజు మాదిరిగానే వివాదం తలెత్తే అవకాశముంటుందని పేర్కొన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

