Sat Dec 13 2025 19:29:54 GMT+0000 (Coordinated Universal Time)
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో ఏసీబీ నివేదికలో ఏముందంటే?
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది.

ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. 2025 సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి తొలి నివేదిక ఏసీబీ పంపింది. . 2024 డిసెంబర్ 19న నమోదైన ఫార్ములా-ఈ కార్ రేస్ కేసుపై నివేదిక ఇచ్చింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ4, ఏ5గా ఎఫ్.ఈ.ఓ ప్రతినిధులును చేర్చింది. తుది నివేదికలో కీలక అంశాలను ఏసీబీ అధికారులు ప్రస్తావించారు. ఫార్ములా ఈ-రేస్ నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమని, ప్రభుత్వ అనుమతులు లేకుండానే రేస్ నిర్వహించారనింది.
క్విడ్ ప్రోకో జరిగిందని...
ఇందులో క్విడ్ ప్రో కో జరిగిందని నివేదికలో ఏసీబీ పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయని, ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు ముందే బీఆర్ఎస్ కి ఈ-బాండ్లు చెల్లించారని ఏసీబీ నివేదికలో చెప్పింది. గవర్నర్ సంతకం లేకుండానే అగ్రిమెంట్లకు ఐఏఎస్ అరవింద్ అనుమతులు మంజూరు చేసిందని, రెండు అగ్రిమెంట్లు కూడా గవర్నర్ నోటీసులో లేవని పేర్కొంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ నుంచి కూడా ఎలాంటి అనుమతులు పొందలేదని నివేదికలో పేర్కొంది. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, ఆర్థిక మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, చెల్లింపులు, అగ్రిమెంట్లు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తుది నివేదికలో ఏసీబీ పేర్కొంది.
Next Story

