Thu Mar 19 2026 00:15:52 GMT+0530 (India Standard Time)
Revanth Redddy : విదేశీ పర్యటనకు రేవంత్ కు అనుమతి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు బ్రిస్బేన్, దావోస్‌లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ బెయిల్ కోసం అప్పట్లో పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించారు.
దావోస్ పర్యటనకు...
త్వరలో పలు దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని, ఆరు నెలలు పాస్‌పోర్టు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అభ్యర్థించగా కోర్టు అందుకు అంగీకరించింది. అయితే జులై 6వ తేదీలోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించాల్సి ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆయన దావోస్ పర్యటనకు బయలుదేరుతున్నారు
Next Story

