Fri Dec 05 2025 14:24:46 GMT+0000 (Coordinated Universal Time)
అభిషేక్ మనుసింఘ్వి నామినేషన్ దాఖలు
తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మనుసింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు

తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మనుసింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభిషేక్ మనుసింఘ్వి మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు దాకలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణ సమస్యలపై...
తాను తెలంగాణ సమస్యలను రాజ్యసభ లో లేవెనెత్తుతానని, విభజన సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని అభిషేక్ మనుసింఘ్వి ఈ సందర్భంగా మాట్లడుతూ అన్నారు. తెలంగాణ తరుపున రాజ్యసభలోనే కాదు న్యాయపరంగా వాదించేందుకు అభిషేక్ మనుసింఘ్వి రాష్ట్రానికి మరింత ఉపయోగపడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story

