Sun Mar 22 2026 06:27:10 GMT+0530 (India Standard Time)
Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ప్రమాదం నుంచి బయటపడి.. మరొక ప్రమాదంలో మృతి
జహీరాబాద్ కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు మరణించాడు. జహీరాబాద్ కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎనిమిదేళ్లుగా పృధ్వీరాజ్ అమెరికాలోనే ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. గత ఏడాది పృథ్వీరాజ్ కు వివాహం జరిగింది. తన శ్రీమతి శ్రీప్రియతో కలసి కారులో వెళ్తుండగా వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో దంపతులిద్దరూ తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడిన పృథ్వీరాజ్ ఈ ప్రమాదం జరిగిన విషయంపై బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు.
మరొక కారు ఢీకొట్టడంతో...
ఆ సమయంలో వేగంగా వచ్చిన ఇంకొక కారు ఆయనను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. పృథ్వీరాజ్ తండ్రి విద్యుత్తు శాఖలో పనిచేసి రిటైర్డ్ అయి హైదరాబాద్ లోని అలకాపురిలో నివాసం ఉంటున్నారు. ఆయన కూడా రెండేళ్ల క్రితం మరణించాడు. ఘటన తెలిసిన కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ఆదివారం పృథ్వీరాజ్ మృతదేహాాన్ని హైదారాబాద్ కు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడి మరొక ప్రమాదంలో మరణించడం దురదృష్టకరమైన ఘటన కాక మరేంటని బంధువులు రోదిస్తున్నారు.
Next Story

