Wed Oct 16 2024 05:21:39 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్లో దారుణం: యువతిపై నుండి దూసుకెళ్లిన బస్సు
యువతి పైనుండి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన శనివారం సాయంత్రం హైదరాబాద్ మాదాపూర్ లోని కొత్తగూడ సర్కిల్ వద్ద...
యువతి పైనుండి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన శనివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది..!! హైదరాబాద్ లో మాదాపూర్ లోని కొత్తగూడ సర్కిల్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది..!! దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసి కెమెరా లలో రికార్డు అయ్యాయి...!!
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది అని సిసి టీవీ ఫుటేజ్ చూస్తే అర్థం అవుతుంది..!!నాలుగు రోడ్ల కూడలి కావడం తో... యువతి రోడ్డు దాటుతుండగా... వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు యువతి మీదనుండి వెళ్ళిపోయింది..దానితో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది..!!
ఘటనా వివరాలు అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి,ఘటన పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు...!!
Next Story