Thu Mar 19 2026 01:07:23 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో మంకీపాక్స్ కేసు?
తెలంగాణలో మంకీ పాక్స్ లక్షణాలతో ఒక యవకుడిని కనుగొన్నారు. అతని రక్త నమూనాలను వైద్య పరీక్షలకు పంపారు.

తెలంగాణలో మంకీ పాక్స్ లక్షణాలతో ఒక యవకుడిని కనుగొన్నారు. అతని రక్త నమూనాలను వైద్య పరీక్షలకు పంపారు. ఇంకా ఫలితం ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వైద్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. మంకీ పాక్స్ లక్షణాలు ఉండటంతో ఆ యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో...
కామారెడ్డి జిల్లాలో ఒక యువకుడికి మంకీపాక్స్ లక్షణాలు కన్పించడంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనితో కాంటాక్ట్ అయిన వారిని కూడా గుర్తిస్తున్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత వారిని కూడా ఐసొలేషన్ కు పంపాలన్న యోచనలో వైద్య శాఖ అధికారులున్నారు. అయితే ఆ యువకుడికి మంకీపాక్స్ సోకిందా? లేదా? అన్నది పరీక్ష ఫలితం వచ్చిన తర్వాతనే ధృవీకరిస్తామని వైద్య శాఖ అధికారులు చెప్పారు.
Next Story

