Fri Dec 05 2025 16:15:15 GMT+0000 (Coordinated Universal Time)
తెలిసిన వ్యక్తి చనిపోయాడు.. ఆంబోతు ఏడుస్తూ!!
ఒక ఆంబోతు ఓ వ్యక్తి చనిపోతే కడసారి చూడడానికి వచ్చింది.

ఒక ఆంబోతు ఓ వ్యక్తి చనిపోతే కడసారి చూడడానికి వచ్చింది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం మీగడంపాడుతండాకు చెందిన గిరిజన రైతు రూపావత్ చిన్నానాయక్ అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. ఇంటి వద్ద ఉంచిన మృతదేహం వద్దకు ఆ ప్రాంతంలో తిరిగే ఆంబోతు తెల్లవారుజామునే వచ్చింది. ఫ్రీజర్లో ఉంచిన చిన్నా మృతదేహాన్ని చూస్తూ అక్కడే తిరుగుతూ అక్కడే పడుకుని ఉండిపోయింది. అదిలించినా వెళ్లకుండా 2 గంటల పాటు అక్కడే ఉంది. చిన్నానాయక్కు ఆ ఆంబోతుకు ఉన్న అనుబంధం గురించి గ్రామస్థులు మాట్లాడుకుంటూ ఉన్నారు.
News Summary - Ambothu, who came to the body of a deceased farmer in the early hours of the morning, stayed there for 2 hours.
Next Story

