Thu Mar 19 2026 12:11:40 GMT+0530 (India Standard Time)
నేడు మునుగోడులో కాంగ్రెస్ సభ
కాంగ్రెస్ కార్యకర్తల సమాశం నేడు మునుగోడు నియోజకవర్గంలో జరగనుంది

కాంగ్రెస్ కార్యకర్తల సమాశం నేడు మునుగోడు నియోజకవర్గంలో జరగనుంది. మునుగోడు నియోజకవర్గం చుండూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ముఖ్య కార్యకర్తలను ఆహ్వానించారు. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో కాంగ్రెస్ ముందుగా తన పార్టీ క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నంలో పడింది. కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసింది.
భరోసా ఇచ్చేందుకు...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ కు కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు, వారి భరోసా కల్పించేందుకు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
Next Story

