Sat Mar 21 2026 16:11:39 GMT+0530 (India Standard Time)
నేడు ప్రధాని మోదీతో కార్పొరేటర్ల సమావేశం
ప్రధాని మోదీతో నేడు బీజేపీ కార్పొరేటర్ల సమావేశం జరగనుంది. బీజేపీ కార్పొరేటర్లు నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు

ప్రధాని నరేంద్ర మోదీతో నేడు బీజేపీ కార్పొరేటర్ల సమావేశం జరగనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వీరి సమావేశం జరగనుంది. నిజానికి మోదీ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు కార్పొరేటర్లతో సమావేశం కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో సమావేశం వాయిదా పడటంతో మోదీ కార్పొరేటర్లను స్వయంగా ఢిల్లీకి ఆహ్వానించారు.
రానున్న ఎన్నికలకు.....
వచ్చే ఎన్నికలకు సంబంధించి మోదీ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్పొరేటర్లకు ఉద్భోధించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు సత్సంబంధాలు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ప్రజలను బీజేపీ వైపు మళ్లించాలని ప్రధాని మోదీ వారికి తెలియజేయనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story

