Mon Feb 02 2026 00:42:45 GMT+0000 (Coordinated Universal Time)
సికింద్రాబాద్ క్లబ్ లో అగ్ని ప్రమాదం...20 కోట్ల నష్టం
సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు

సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను అదుపులోకి తీసుకు రావడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే క్లబ్ పూర్తిగా దగ్దమయింది. ఈరోజు తెల్లవారు జామును 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు.
చుట్టుపక్కల వారిని...
వీకెండ్ కావడంతో తెల్లవారు జాము వరకూ కార్యక్రమాలు జరిగాయని చెబుతున్నారు. పది ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతానికి రాకపోకలను మూసివేశారు. ఈ ప్రమాదం కారణంగా 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
Next Story

