బతికున్న వ్యక్తి మార్చురీలో 15 గంటలు
మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి సజీవంగా ఉన్నాడన్న విషయాన్ని కూడా గమనించకుండా మార్చురీలో ఉంచి తాళం వేసి వెళ్లారు.

మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి సజీవంగా ఉన్నాడన్న విషయాన్ని కూడా గమనించకుండా మార్చురీలో ఉంచి తాళం వేసి వెళ్లారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్నాడు. కాళ్ల నొప్పులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రాజు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి వచ్చాడు. అతని వద్ద ఆధార్‌కార్డు లేదని చేర్చుకోకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోని క్యాంటీన్ పరిసరాల్లో ఉన్నాడు. అపరిశుభ్రంగా ఉన్న అతడ్ని గమనించిన నిర్వాహకులు సిబ్బందికి చెప్పి ఆసుపత్రి ఆవరణ నుంచి పంపించారు. దీంతో రాజు మార్చురీ ముందు పడుకున్నాడు. కదలిక లేకుండా ఉన్న రాజును చూసి చనిపోయాడని భావించి మార్చురీ వరండాలో ఉన్న స్ట్రెచర్‌పై పడుకోబెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాతి రోజు ఉదయం స్వీపర్లు శుభ్రం చేసేందుకు మార్చురీలోకి వెళ్లారు. వరండాలో స్ట్రెచర్‌పై కదులుతున్న వ్యక్తిని గమనించి భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బతికున్న వ్యక్తిని సుమారు 15 గంటలు మార్చురీలో ఉంచారు.

