Sun Mar 15 2026 13:05:48 GMT+0530 (India Standard Time)
Leopard : ఆ చిరుతపులిని చంపిందెవరు?
తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులి మరణించింది.

తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులి మరణించింది. ఎవరైనా దీనిని చంపారా? లేదా అనారోగ్యంతో మృతి చెందిందా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుతపులి కళేబరాన్ని చూసిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అనారోగ్యంతోనేనా?
అయితే చిరుతపులి అక్కడకు రావడంతో వేటగాళ్ల బారిన పడి చనిపోయిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతుందన్నాయి. అమరగిరి రహదారి పక్కన గుడి ప్రాంతంలో ఈ చిరుతపులి మరణించింది. అటవీ శాఖ అధికారులు చిరుత పులి మరణించడానికి కారణాలపై విచారణ ప్రారంభించారు. దీంతో పాటు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.
Next Story

