Sun Mar 15 2026 19:58:48 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నేడు కీలకం
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు విచారణకు హాజరు కావాలని ముఖ్యమైన వారికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఇప్పటికే నలుగురికి నోటీసులు జారీ చేసింది. వీరిలో బీఎల్ సంతోష్, శ్రీనివాస్, తుషార్, జగ్గుస్వామిలు ఉన్నారు.
హాజరు కాకుంటే....
అయితే బీఎల్ సంతోష్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న బీఎల్ సంతోష్ ను విచారణకు సహకరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఆయన విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తదుపరి విచారణ పూర్తయ్యేంత వరకూ బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Next Story

