Sun Mar 15 2026 07:42:19 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు విచారణ
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ విచారణ జరుగుతుంది.
కండువా మార్చిన...
బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిలో కొందరికి నామినేటెడ్ పదవులు కూడా దక్కాయి. అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వీరిపై అనర్హత వేటు వేయాలంటూ వేసిన పిటీషన్ పై విచారణ జరుగుతుండటంతో ఇరువర్గాల వాదనలను వినిపించనున్నారు.
Next Story

