Sun Mar 22 2026 04:53:59 GMT+0530 (India Standard Time)
నేడు టీఎస్పీఎస్సీ లీకేజీపై హైకోర్టులో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. పేపర్ లీక్ అంశాన్ని సీబీఐ చేత విచారణ జరిపించాలని ఎన్ఎస్యూఐ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ విచారణకు వస్తున్న సందర్భంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు హైకోర్టుకు హాజరుకానున్నారు.
ఎన్ఎస్యూఐ పిటీషన్ పై....
ఎన్ఎస్యూఐ తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది తమ వాదనలు విన్పించనున్నారు. ముఖ్యమంత్రి కుటుంబంపై ఆరోపణలు వస్తుండటంతో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం చేత విచారిస్తే నిజాలు బయటకు రావని ఎన్ఎస్యూఐ తరుపున న్యాయవాది వాదించనున్నారు. అందుకే సీబీఐకి ఈ కేసును అప్పగిస్తే వాస్తవ విషయాలు బయటకు వస్తాయని చెప్పనున్నారు. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story

