Sat Dec 13 2025 22:33:23 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్నారు

మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్నారు. ఆపరేషన్ కగార్ తర్వాత వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతుండటంతో పోలీసులకు సరెండర్ అవుతున్నారు. తాజాగా శుక్రవారం మొత్తం 37 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 25 మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోవడంతో ఆ నక్సల్ విభాగానికి గట్టి దెబ్బపడినట్టు పోలీసులు తెలిపారు. కొయ్యాడ సంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాని నారాయణ అలియాస్ రమేశ్, ముచ్చాకీ సోమడ అలియాస్ ఎర్ర, ఈ ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులే. ఒక్కొక్కరి పై ఇరవై లక్షల రూపాయల రివార్డు ఉందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
వివిధ హోదాల్లో ఉన్న...
పోలీస్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం వివిధ హోదాలో ఉన్న కేడర్‌కు ఐదు లక్షల రపాయలు, ఏసీఎం, పీపీసీఎం ర్యాంకు వారికి రూ.4 లక్షల బహుమతి ప్రకటించారు. సాధారణ పార్టీ సభ్యులపై లక్ష బహుమతి ఉంది. పత్రికా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం పునరావాస చర్యలు చేపడుతుందని, సామాజిక ప్రధాన ప్రవాహంలో కలిసేందుకు అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు.ఆజాద్ వంటి వారు కూడా లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి మరింత ఎదురు దెబ్బ తగిలింది. మిగిలినవారు కూడా ఏవరైనా ఉంటే లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు నిచ్చారు.
Next Story

