మీ డ్రైవింగ్ కు 12 పాయింట్ల రక్ష
తెలంగాణ పోలీసుశాఖ ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా ఝళిపించబోతోంది.

తెలంగాణ పోలీసుశాఖ ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా ఝళిపించబోతోంది. నిబంధనలు పాటించనివారి లైసెన్సులను రద్దు చేసేందుకు ‘పాయింట్ల’ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. పోలీసు, రవాణాశాఖల మధ్య సాంకేతిక సమన్వయం మెరుగుపరచనున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల జరుగుతున్న నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించేవారి విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఉల్లంఘనులపై ఎప్పటికప్పుడు చలానాల రూపంలో జరిమానా విధిస్తున్నారు. కానీ చాలామంది ఈ జరిమానాలు కట్టడం లేదు. రెండేళ్ల వ్యవధిలో ఎవరికైనా 12 పాయింట్లు వస్తే వారి లైసెన్సు ఏడాదిపాటు రద్దు చేస్తారు. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. 12, ఆపైన పాయింట్లు నమోదైతే లైసెన్సులను రవాణాశాఖ ఆటోమేటిక్గా రద్దుచేయాలి. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఈ సమాచార మార్పిడి అనుకున్నంత వేగంగా జరగడం లేదు.

