Wed Jan 28 2026 19:13:17 GMT+0000 (Coordinated Universal Time)
10th exams : ఆన్సర్‌షీట్లు మిస్సింగ్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పదో తరగతి జవాబు పత్రాలు మాయమయ్యాయి.

వికారాబాద్ జిల్లా తాండూరులో టెన్త్ ప్రశ్నా పత్రం లీకేజీ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జవాబు పత్రాలు మాయమయ్యాయి. పరీక్షా కేంద్రాల నుంచి జవాబు పత్రాల బండిల్స్‌ను అధికారులు పోస్టాఫీసులో అప్పగించారు.
బస్టాండ్‌కు తరలిస్తుండగా...
వారు కట్టలుగా అన్నీ కట్టకట్టి పోస్టాఫీస్ నుంచి ఉట్నూరు బస్టాండ్ కు తరలిస్తుండగా ఆటో నుంచి ఒక బండిల్ జారిపోయింది. బస్టాండ్‌లో వాటిని లెక్కించగా ఒకటి తక్కువగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్సర్ షీట్లు మిస్ కావడంతో ఆందోళన నెలకొంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story

