Sat Dec 06 2025 08:07:29 GMT+0000 (Coordinated Universal Time)
ఆ గ్రామంలో సెల్ఫ్ లాక్ డౌన్.. ఎందుకో తెలుసా ?
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో మొదటిసారిగా లాక్ డౌన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు.. ఒక గ్రామ ప్రజలు 10 రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో మొదటిసారిగా లాక్ డౌన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు.. ఒక గ్రామ ప్రజలు 10 రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి మూడ్రోజుల క్రితమే ఒమిక్రాన్ నిర్థారణ అవ్వగా..గూడెంలో ఉన్న అతడిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులతో పాటు.. కాంటాక్ట్ లో ఉన్న మరో 64 మంది శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేశారు.
అతని తల్లి, భార్యకు కోవిడ్ పాజిటివ్ గా తేలగా.. ఒమిక్రాన్ లక్షణాలు మాత్రం లేవని ధృవీకరించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఒమిక్రాన్, కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అవ్వడంతో.. గూడెం గ్రామ పంచాయతీ 10 రోజులపాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు తీర్మానించింది. ఇందుకు గ్రామ ప్రజలంతా ఓకే చెప్పారు. ఇలా ముందు జాగ్రత్తగా లాక్ డౌన్ పాటించడం వల్ల.. గ్రామంలో ఎవరికైనా కోవిడ్, లేదా ఒమిక్రాన్ సోకినా అది ఇతరులకు అంటకుండా ఉంటుందనేది గ్రామస్తుల నమ్మకం.
Next Story

