Wed Mar 04 2026 23:38:21 GMT+0530 (India Standard Time)
Breaking : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు
వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించారు

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించారు. వరంగల్ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలో ఆయన వెంట పార్టీలోకి వచ్చిన వారు. ఇద్దరికీ తెలుగుదేశంపార్టీలో ఉన్న నాటి నుంచి మంచి స్నేహబంధం ఉంది. వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసే పనిమీదనే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. పార్టీ నాయకత్వంతో చర్చించారు.
రేపు నామినేషన్ ...
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా రెండు స్థానాలు కాంగ్రెస్ కే దక్కనున్నాయి. అందులో ఒకటి ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వికి ఖరారయింది. ఆయన హైదరాబాద్ కు కూడా చేరుకున్నారు. ఆయన ఈరోజు నామినేషన్ వేయాల్సి ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో రేపు నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. అనేక పేర్లనుపరిశీలించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతో చివరకు వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీన ఎన్నిక జరగనుంది.
Next Story

