Sat Dec 13 2025 06:36:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఏపీ సర్కార్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు
తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులపై సీరియస్ గా రంగంలోకి దిగింది.

తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులపై సీరియస్ గా రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టును ఆశ్రయించి రెండు రాష్ట్రాల నీటి పంపిణీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు.
అభ్యంతరాలను తెలియజేయాలని...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపంచనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అభిషేక్ మను సింఘ్వీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు.
Next Story

