Fri Feb 27 2026 09:41:32 GMT+0530 (India Standard Time)
Telangana : వాహనదారులకు షాకిచ్చిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. మార్చి 1వ తేదీ నుండి కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరిట రెండు వేల రూపాయల నుంచి పది వేల రూాపయల వరకూ వసూలు చేసేందుకు తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో మార్చి 1వ తేదీ నుంచి కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను వసూలు చేసే నిబంధనను ప్రభుత్వం అమలు చేయనుంది.
రహదారి భద్రత పన్నుతో...
వాహనాల రహదారి భద్రత పన్నుతో ఏడాదికి ప్రభుత్వానికి 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణలో వాహనాల ధరలు పెరగనున్నాయి. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై రెండు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలు చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఉ రవాణా శాఖ త్తర్వులు జారీ చేసింది.
Next Story

