Sat Dec 27 2025 06:57:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది.

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో నియామకాలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఆ విధంగా నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించి సక్సెస్ ఫుల్ గా నియామకాలను పూర్తి చేసింది. మరొకవైపు మిగిలిన శాఖల్లో ఖాళీగా ఉన్న వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది.
198 పోస్టులకు సంబంధించి...
తాజాగా తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో స్థానికులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో 198 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 198 పోస్టులకు సంబంధించి అర్హులైన వారిని నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్ లో ప్రకటించారు. ఇందులో ట్రాఫిక్ సూపర్ వైజర్స్ ట్రైనీలు, మెకానిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులుంటాయని నోటిఫికేషన్ లో పేర్కొంది. అర్హత కలిగిన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు.
వచ్చే నెల 20వ తేదీ వరకూ...
ఈ నెల 30వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. జనవరి20వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందులో 84 టీఎస్టీ, 114 ఎంఎస్టీ పోస్టులున్నాయి. ఎంపికయిన వారికి నెలకు ఇరవై వేల రూపాయల నుంచి80 వేల వరకూ వేతనం లభిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులందరూ వచ్చే నెల 20వ తేదీలోపు www.tgprb.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు కావాల్సిన అర్హత, వయసు, దరఖాస్తు చేయాల్సిన విధానం, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్ సైట్ ను చూసుకోవచ్చు.
Next Story

