Sat Dec 13 2025 22:32:20 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఢిల్లీ నుంచి బయలుదేరిన మయన్మార్ సైబర్ ఫ్రాడ్ బాధితులు
మయన్మార్ మయవాడీలోని సైబర్ నేరాల శిబిరాల్లో చిక్కుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ పౌరులకు ప్రభుత్వం అండగా నిలిచింది.

మయన్మార్ మయవాడీలోని సైబర్ నేరాల శిబిరాల్లో చిక్కుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ పౌరులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రత్యేక భారత వైమానిక దళం విమానంలో భారతీయ పౌరులను మయన్మార్ నుంచి తీసుకొచ్చారు. వీరిని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు నిన్న గ్రేటర్ నోయిడాలో సంబంధిత రాష్ట్ర అధికారులకు అధికారికంగా అప్పగించారు. వారిలో 11 మంది వ్యక్తులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారున్నారు.
తెలంగాణకు చెందిన...
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి పలు జిల్లాల వారు ఈ బృందంలో వున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వీరిని సంబందిత కేంద్ర ప్రభుత్వ అధికారులు తగిన విచారణ ధృవీకరణ అనంతరం తెలంగాణకు చెందిన వారిని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులకు అప్పగించారు.వీరికి తెలంగాణ ప్రభుత్వ అధికారులు వెంటనే తాత్కాలిక వసతి అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. వారు నిన్న రాత్రికి హైదరాబాద్ వెళ్లడానికి ప్రయాణ ఏర్పాట్లు చేశారు.
Next Story

