Thu Apr 02 2026 09:53:03 GMT+0530 (India Standard Time)
Telangana : ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ యాక్ట్
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉందని ఎస్పీ తెలిపారు

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఈ కాలంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధమని ఎస్పీ తెలిపారు. ర్యాలీలు, ప్రదర్శనలనకు నిషేధమని చెప్పారు.
ఆయుధాలు కలిగి...
నిషేధిత ఆయుధాలు కలిగి ఉండటం, ప్రజలకు ఇబ్బంది కలిగించే సమావేశాలు కూడా పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమాలకు ముందుగా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
Next Story

