Sun Mar 29 2026 11:29:23 GMT+0530 (India Standard Time)
Telangana :తెలంగాణలో సన్నబియ్యం పథకానికి ఏడాది
తెలంగాణలో సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తయింది.

తెలంగాణలో సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తయింది. పేదలకు రేషన్ కార్డుల మీద సన్న బియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే. సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేదల ఇంట్లో అందరికీ కడుపు నిండా భోజనం లభిస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రేపు అసెంబ్లీలో లంచ్...
అయితే సన్నబియ్యం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా రేపు తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. పీడీఎస్ సన్నబియ్యంతో అసెంబ్లీలో లంచ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భోజనం చేసి పేదలకు సంఘీభావాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు.
Next Story

