Sat Jan 10 2026 22:07:23 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. సూర్యాపేట రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. జనగామ జిల్లాలోని లింగాల ఘన్ పూర్ నవాబ్ పేట వద్ద ఒక కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. ఘటన స్థలంలో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఇద్దరు మృతి...
ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మరొక వ్యక్తిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తీసుకెళ్లారు. అతి వేగంతో పాటు పొగమంచు కూడా ఈ ప్రమాదానికి గల కారణమని తెలిసింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

