Fri Apr 10 2026 22:26:07 GMT+0530 (India Standard Time)
Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆటో, స్కూటీ ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారని పోలీసులు తెిపారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లోని పిప్రి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పిప్రి, భీమగల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు.
ఇద్దరు మృతి...
అయితే ప్రమాదానికి అతి వేగంతో పాటు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

