Mon Apr 06 2026 09:53:10 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లాలో బైకును లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. అత్యంత వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.
ఇద్దరు మృతి...
మృతులు ఏలూరు జిల్లాకు చెందిన సంతోష్ (19), సందీప్ (20)గా గుర్తించారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగంతో వస్తున్న వాహనం ఢీకొట్టడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Next Story

