Tue Mar 17 2026 10:21:29 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించే ఛాన్స్ ఉంది.
రాష్ట్రానికి రావాల్సిన...
ఈ మేరకు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ తీసుకున్నారని తెలిసింది. మరొకవైపు పార్టీ హైకమాండ్ ను కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు మంత్రి వర్గ విస్తరణ వంటి అంశాలను కూడా రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

