Fri Jan 16 2026 04:41:59 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ జిల్లాల బాట
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి జిల్లాల బాట పట్టనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి జిల్లాల బాట పట్టనున్నారు. నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొరాట-చనాక బ్యారేజ్ నుంచి నీటి విడుదల చేయనున్నారు. అనంతరం సదర్మాట్ బ్యారేజ్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
పోలీసుల ముందస్తు అరెస్ట్...
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నేడు సీఎం రేవంత్ పర్యటనను అడ్డుకుంటామన్న బీఆర్ఎస్ నేతలు ప్రకటించడంతో మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసుల మోహరించారు. రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో, ఎల్లుండి ఖమ్మం, వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుంది.
Next Story

