Fri Mar 27 2026 23:44:09 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర జూమ్ మీటింగ్ ను నిర్వహించనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు. అనేక చోట్ల రెబల్స్ గా దిగడంతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతతలు తమ వర్గం వారి తరుపున ప్రచారం చేయడంపై ఆయన చర్చిస్తారు.
మున్సిపల్ ఎన్నికలపై...
నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఆఖరి రోజు అందరూ సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రచారంలో పాల్గొనాలని కోరనున్నారు. ఇక ఎలక్షనీరింగ్ పై కూడా రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అడిగితెలుసుకోనున్నారు. పోలింగ్ రోజున అప్రమత్తంగా ఉండాలని చెప్పనున్నారు.
Next Story

