Sat Dec 13 2025 22:31:42 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. రాహుల్ గాంధీ ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి ఆయన ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు...
రాహుల్ గాంధీ కూడా ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మమత బెనర్జీ, స్టాలిన్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురోరాగ్యాలతో మరింత కాలం ప్రజా సేవ చేయాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఫోన్ లో రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పారు.
Next Story

