Mon Feb 16 2026 11:52:24 GMT+0530 (India Standard Time)
జగిత్యాలలో యువకుడి హత్యకు కారణమదేనట
జగిత్యాల పట్టణంలో యువకుడి హత్య సంచలనానికి దారి తీసింది

జగిత్యాల పట్టణంలో యువకుడి హత్య సంచలనానికి దారి తీసింది. హత్యకు వివాహేతర సంబంధం కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. నిన్న జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులోని కరీంనగర్ డైరీ ఎదుట విశ్వనాధ్ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్న విశ్వనాథ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాహేతర సంబంధమే...
అయితే సహజీవనం చేస్తున్న మహిళ భర్తే విశ్వనాథ్ ను చంపినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ఱారించారు. అయితే హత్య చేసింది ఎవరన్న దానిపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story

