Wed Jan 21 2026 06:37:37 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ఆదిలాబాద్ జిల్లాకు మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం మల్లు భట్టి విక్రమార్క నాగోబాను దర్శించుకోనున్నారు. గిరిజనులు అత్యంత వేడుకగా నిర్వహించుకునే నాగోబా జాతార ఇప్పటికే ప్రారంభమయింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉంటున్న ఆదివాసీలు నాగోబా జాతరకు చేరుకుంటున్నారు.
నాగోబాను...
సాయంత్రం నాగోబాను దర్శించుకోనున్న మల్లు భట్టి విక్రమార్క అంతకు ముందు దంతనాపల్లి, పులిమడుగులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూమి పూజను చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Next Story

