Sun Feb 08 2026 15:11:09 GMT+0530 (India Standard Time)
నేడు కేటీఆర్ షెడ్యూల్ ఇదే
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు తాండూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు తాండూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. రేపటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రచారంలో వేగం పెంచారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...
ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేటీఆర్ వర్ధన్నపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి నేతలతో సమావేశమై అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నారు. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో వెనక్కు తగ్గకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరనున్నారు
Next Story

