Fri Jan 09 2026 23:00:09 GMT+0000 (Coordinated Universal Time)
KTR : భూములు ఎక్కడున్నా వదలని రేవంత్ సర్కార్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భూ దోపిడీదారుగా ప్రభుత్వం మారిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ భూములను లాక్కుని వారిని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుందని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ భూములను లాక్కోవడం ఇదే మొదటి సారి కాదన్న కేటీఆర్ గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు భూములను కూడా లాక్కునేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు.
యూనివర్సిటీ భూములను...
జయశంకర్ యూనివర్సిటీ నుంచి వందలాది ఎకరాలు తీసుకున్నారని, యూనివర్సిటీ విద్యార్థులు ఎంత పోరాడినా వారి ఉద్యమాన్ని అణిచివేశారని తెలిపారు. ఉర్దూ యూనివర్సిటీ భూములను కూడా నోటీసులు ఇవ్వడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమై వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో తమ మద్దతు ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు.
Next Story

