Thu Mar 26 2026 09:52:40 GMT+0530 (India Standard Time)
పెట్రోల్, గ్యాస్‌పై ఆందోళన వద్దు: కిషన్ రెడ్డి
పెట్రోల్, గ్యాస్‌పై ఆందోళన వద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

పెట్రోల్, గ్యాస్‌పై ఆందోళన వద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు పెట్రోల్, గ్యాస్ సరఫరాపై పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో మాట్లాడినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పూరీ హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఎల్పీజీ సరఫరాను ...
ఎల్పీజీ సరఫరాను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెట్రోల్ కొరత సృష్టించేవారిపై, వదంతులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎవరూ ఆందోళన చెందవద్దని పెట్రోలు, డీజిల్ కొరత అంటూ ఏమీ లేదని కిషన్ రెడ్డి చెప్పారు.
Next Story

