Fri Feb 27 2026 14:34:04 GMT+0530 (India Standard Time)
క్లీన్ చిట్ పై కవిత ఏమన్నారంటే?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊరట లభించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊరట లభించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. తనపై రాజకీయంగా అక్రమ కేసులు బనాయించారన్నారు. ఐదున్నర నెలల పాటు తనను జైలులో ఉంచారని, తాను కోల్పోయిన కాలాన్ని ఎవరు తిరిగి తీసుకువస్తారని కవిత ప్రశ్నించారు. తాను మొదటి నుంచి ఈ కేసులో రాజకీయ కుట్ర ఉందని చెబుతున్నానని, అది ఈరోజు న్యాయస్థానం తీర్పుతో స్పష్టమైందని చెప్పారు. కేసీఆర్, బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకునే ఈ కేసును పెట్టారని కవిత అన్నారు.
జైలులో ఉన్నప్పుడు...
తాను జైలులో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచిన తన అత్తమామలకు, తల్లీ దండ్రులకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. కావాలనే ఈ కేసులో ఇరికించారని అన్నారు. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పుతో తాను కడిగిన ముత్యంలా బయటపడ్డానని అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు తమ సొంత ఖర్చులతో ఢిల్లీకి వచ్చి తనకు అండగా నిలిచిన జాగృతి కార్యకర్తలకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఐదున్నర నెలలే కాదు సభల్లో తనపై లిక్కర్ స్కామ్ బురద జల్లిన వారంతా ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని కవిత ప్రశ్నించారు. తనకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మరిచిపోనని కూడా కవిత తెలిపారు.
Next Story

