Sun Mar 15 2026 11:16:35 GMT+0530 (India Standard Time)
Summer Effect : మండే ఎండల్లో చిరు జల్లులట.. కూల్ న్యూస్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో నలభై ఐదు డిగ్రీలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉక్కపోతతో పాటు వేడిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉంది. ఉపరి తల ద్రోణి కారణంగా నేడు కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న కాలంలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉరుములు, మెరుపులతో...
అయితే ఆంధ్రప్రదేశ్ లో నేడు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ప్రజలు విద్యుత్తు స్థంభాలు, చెట్ల కింద నిల్చోవద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని తెలిపింది.
నేడు మోస్తరు వానలు...
తెలంగాణలోనూ నేడు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లోనే ఈ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని చెప్పింది. తెలంగాణలోనూ భారీ ఉష్ణోగ్రతలు ఇటీవల కాలంలో నమోదవుతున్నాయి. ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో అంటే మే నాలుగో వారంలో మాత్రం ఉష్ణోగ్రతలు నలభై నుంచి నలభై డిగ్రీలకు చేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఏప్రిల్, మే నెలలో మాత్రం తెలంగాణ కూడా ఎండలు దంచి కొట్టే అవకాశముందని హెచ్చరించింది.
Next Story

