Sun Feb 01 2026 04:45:27 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. రెండు తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చలి తీవ్రత పూర్తిగా తగ్గలేదు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చలి తీవ్రత పూర్తిగా తగ్గలేదు. పగటి పూట కొంత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. తెల్లవారు జాము నుంచి చలి తీవ్రత ఉంటుంది. అలాగే సాయంత్రం వేళల్లోనూ చలి కొంత పెరుగుతుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఉష్ణోగ్రతలు గరిష్టంగానే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వాతావరణ శాఖ నేడు ఎలాంటి వాతావరణం ఉంటుందన్నది వెల్లడించింది.
ఉష్ణోగ్రతలు క్రమంగా...
ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా పొగమంచు ఏర్పడే అవకాశముంది. రాయలసీమలోనూ పొడి వాతావరణం నెలకొని ఉంటుందని చెప్పింది. చలిగాలుల తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు కూడా కొన్ని రకాల ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.
చలి తగ్గినప్పటికీ...
తెలంగాణలోనూ చలిగాలుల తీవ్రత పూర్తిగా తగ్గింది. వేడి వాతావరణం కనిపిస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగాయని, రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రానున్న రోజుల్లో పొడి వాతావరణంతో పాటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతల నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story

