Mon Mar 16 2026 20:24:57 GMT+0530 (India Standard Time)
తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారా?
తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు

తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ మీడియా హాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుందని అన్నారు. ఆంధ్రాకు దాసోహమైన ముఖ్యమంత్రి.. ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయన్నారు.ఢిల్లీ మీటింగ్ మినిట్స్ వచ్చి నెల దాటినా రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మొద్దు నిద్ర వీడి నీటి హక్కులను కాపాడాలి.. లేఖల డ్రామాలు కట్టిపెట్టాలంటూ హరీశ్ రావు ధ్వజమెత్తారు.
ముందుచూపు లేని...
చేతకాని, బాధ్యతలేని, ముందుచూపు లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి వల్ల కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీటి హక్కుల సాధనలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. కాంగ్రెస్ మొద్దు నిద్రను వదిలించేందుకే బీఆర్ఎస్ పక్షాన పదేపదే నిలదీస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Next Story

