Sun Feb 08 2026 10:25:37 GMT+0530 (India Standard Time)
నేడు హరీశ్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారం
మాజీ మంత్రి హరీశ్ రావు ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు

మాజీ మంత్రి హరీశ్ రావు ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అందులో భాగంగా పటాన్చెరువు, సదాశివపేట, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఉదయం 8:30 గంటలకు బచ్చుగూడెం గ్రామం, ఇంద్రేశం మున్సిపాలిటీ కి చేరుకుని సభలో ప్రసంగిస్తారు. తొమ్మిది గంటలకు చిట్కుల్,ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఉదయం పది గంటలకు సదాశివపేట మున్సిపాలిటీ, సంగారెడ్డి లో పర్యటిస్తారు.
పార్టీ అభ్యర్థులకు మద్దతుగా...
మధ్యాహ్నం 12:30 గంటలకు కోహీర్ మున్సిపాలిటీ,జహీరాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం1:30 గంటలకు జహీరాబాద్ టౌన్,జహీరాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తారు. సాయంత్రం సంగారెడ్డి మున్సిపాలిటీలో పర్యటిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు సంగారెడ్డి టౌన్ లో తమ పార్టీకి చెందిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు.
Next Story

