Fri Mar 13 2026 14:57:27 GMT+0530 (India Standard Time)
Harish Rao : రేవంత్ రెడ్డి పై ఫైర్ అయిన హరీశ్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణపై ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రెజెంటేషన్ ఇస్తానంటావా? అని ఎద్దేవా చేశారు. రైతులకు, పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవంటావని, కానీ మూసీ సుందరీకరణకు లక్షల కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేపడతావని హరీశ్ రావు ప్రశ్నించారు.
మూసీ సుందరీకరణపై...
మూసీ సుందరీకరణపై పేదల మధ్య చర్చజరగాలని, వారిలో నెలకొన్న భయాందోళనలను తొలగించాలని, అంతే తప్ప ఫైవ్ స్టార్ హోటల్స్ లో ప్రెజెంటేషన్ ఇస్తే ఎలా అని హరీశ్ రావు ప్రశ్నించారు. రేవంత్ పాలన తుగ్గక్ పాలనను మరిపిస్తుందని అన్నారు. నిజంగా మూసీ నది నీటిని శుద్ధి చేయాలంటే అందుకు పేదల ఇళ్లను కూలగొట్డడం పరిష్కారం కాదని అన్నారు.పదివేల ఇళ్లను కూలగొడతామని గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన రేవంత్ సర్కార్ లక్ష మంది జీవితాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. గాంధీ విగ్రహం పెట్టడానికి పది వేల ఇళ్లు కూల్చడం అవసరమా? అనిహరీశ్ రావు నిలదీశారు.
Next Story

